Narendra Modi: భాగ్యలక్ష్మి నగరాన్ని వేంకటేశ్వర స్వామి నగరంతో కలిపాం: మోదీ

Modi started speech in Telugu
  • తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించామన్న ప్రధాని 
  • దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామి అయ్యేలా చూశామని వెల్లడి 
  • తెలంగాణను అభివృద్ధి చేయడం నాకు లభించిన అదృష్టమన్న మోదీ 
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో మాట్లాడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలుగు రాష్ట్రాలపైన తెలంగాణ, ఏపీలను కలుపుతూ ఈరోజు సికింద్రాబాద్ - తిరుపతిని కలుపుతూ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామని చెప్పారు. భాగ్యలక్ష్మి నగరాన్ని ( హైదరాబాద్) వేంకటేశ్వరస్వామి నగరంతో కలిపామని తెలిపారు. రెండు రాష్ట్రాలను కలుపుతూ మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామని చెప్పారు. 

తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించామని మోదీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామి అయ్యేలా చూశామని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే డబ్లింగ్ లు, విద్యుదీకరణ పనులను పూర్తి చేశామని చెప్పారు.  జాతీయ రహదారులను పూర్తి చేశామని చెప్పారు. గత 9 ఏళ్లలో 70 కిలోమీటర్ల మెట్రో నెట్ వర్క్ ను నిర్మించామని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి చేయడం తనకు లభించిన అదృష్టమని చెప్పారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించామని తెలిపారు.

Narendra Modi
BJP
Hyderabad

More Telugu News