SRH: టాస్ గెలిచిన సన్ రైజర్స్... ఏంచేస్తుందో!

  • నేడు ఐపీఎల్ లో సన్ రైజర్, లక్నో సూపర్ జెయింట్స్ ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • సన్ రైజర్స్ పగ్గాలందుకున్న రెగ్యులర్ కెప్టెన్ మార్ క్రమ్
SRH won the toss against LSG

ఐపీఎల్-16లో తానాడిన తొలి మ్యాచ్ లో దారుణంగా ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో లక్నో వేదికగా తలపడనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ అయిడెన్ మార్ క్రమ్ జట్టుతో కలవడం అత్యంత సానుకూలాంశం. తొలి మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ జట్టుకు సారథ్యం వహించినా, జట్టుపై ఎలాంటి ముద్ర వేయలేకపోయాడు. ఇవాళ మార్ క్రమ్ చేరిక నేపథ్యంలో సన్ రైజర్స్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అటు, ఎక్స్ ప్రెస్ పేసర్ మార్క్ ఉడ్ దూరం కావడం లక్నో జట్టుకు ఎదురుదెబ్బ అని చెప్పాలి. గత మ్యాచ్ లో ఉడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. 


సన్ రైజర్స్....
అయిడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అన్ మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, అదిల్ రషీద్.

లక్నో సూపర్ జెయింట్స్...
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, నికొలాస్ పూరన్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కట్, రవి బిష్ణోయ్.

More Telugu News