Suyash Sharma: ఆర్సీబీకి చెమటలు పట్టించిన 19 ఏళ్ల కుర్రాడు

Who is Suyash Sharma KKRs teen mystery who bamboozled RCB on IPL debut
  • ఢిల్లీకి చెందిన యువ స్పిన్నర్ సుయాష్ శర్మ విశ్వరూపం
  • ఆర్సీబీతో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా మూడు వికెట్లు
  • రూ.20 లక్షలకే సుయాష్ ను కొనుగోలు చేసిన కేకేఆర్
టీనేజీ క్రికెటర్ సుయాష్ శర్మ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు క్రికెటర్లకు ముచ్చెమటలు పోయించాడు. ముచ్చటగా మూడు వికెట్లు తీసి ఆర్సీబీ ఓటమిని శాసించాడు. దీంతో ఎవరా ఈ సుయాష్ శర్మ అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో ఏర్పడింది. 

ఇంపాక్ట్ ప్లేయర్ గా వెంకటేశ్ అయ్యర్ స్థానంలో వచ్చిన సుయాష్ శర్మ తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేశాడు. దినేష్ కార్తీక్ (9), అనుజ్ రావత్ (1), కరణ్ శర్మ (1) వికెట్లను కూల్చేశాడు. తన కోటా కింద 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ విధానం ఈ సీజన్ నుంచే మొదలు కాగా, ఇప్పటి వరకు ఇదేమంత ఫలితాన్ని ఇవ్వలేదు. మొదటిసారి సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ ఫలితాన్ని అభిమానులకు రుచి చూపించాడు.

లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన సుయాష్ ఢిల్లీకి చెందిన వాడు. క్లబ్ మ్యాచ్ లతో వెలుగులోకి వచ్చాడు. బేస్ ధర రూ.20 లక్షలకే కేకేఆర్ సుయాష్ ను తీసుకుంది. సుయాష్ కు కోల్ కతా జట్టు ఒక్కటే బిడ్ వేయడం గమనార్హం.  ‘‘ట్రయల్ మ్యాచ్ ల్లో అతడి ప్రతిభ చూశాం. అతడు బౌలింగ్ చేసే విధానం పట్ల పూర్తి సంతోషంగా ఉన్నాం. అతడికి పెద్ద అనుభవం లేకపోయినా, మంచి దృక్పథం ఉంది’’ అని కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ తెలిపారు. ‘‘విశ్వాసంతో కూడిన యువ ప్లేయర్. తనకు అవకాశం కోసం ఎదురు చూశాడు. అతడు బౌలింగ్ చేసిన విధానం గొప్పగా ఉంది’’ అని కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా పేర్కొన్నాడు.
Suyash Sharma
KKR
IPL debut
impact player

More Telugu News