Bandi Sanjay: పోలీసులకు 'బలగం' సినిమా చూపిస్తే బాగుండేదని నా భర్త చెప్పారు: బండి సంజయ్ భార్య

Bandi Sanjay wife comments
  • కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి సంజయ్
  • బలగం సినిమా చూస్తే పోలీసులకు ఫ్యామిలీ ఎమోషన్స్ అర్థమయ్యేవన్న సంజయ్
  • అండగా ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన వైనం
పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. కరీంనగర్ జైల్లో ఉన్న ఆయనను ఈరోజు ములాఖత్ లో కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. అనంతరం మీడియాతో బండి సంజయ్ భార్య మాట్లాడుతూ పోలీసులకు ఇటీవల విడుదలైన 'బలగం' సినిమాను చూపిస్తే బాగుండేదని తనతో తన భర్త అన్నారని చెప్పారు. ఆ సినిమా చూస్తే వాళ్లకు ఫ్యామిలీ ఎమోషన్స్ అర్థమయ్యేవని అన్నారని తెలిపారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అండగా ఉన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలను చెపుతున్నానని చెప్పారని వెల్లడించారు. పోలీసుల అరెస్ట్ పై తాను బాధపడటం లేదని, అయితే అరెస్ట్ చేసిన సందర్భమే బాగాలేదని అన్నారని తెలిపారు.
Bandi Sanjay
BJP
Galagam Movie

More Telugu News