MS Dhoni: ప్రణాళిక మేరకే బంతిని వేశా.. కానీ ధోనీ కొట్టిన తీరు అద్భుతం: మార్క్ వుడ్

Bowled it exactly where Rahul and I decided but Dhoni  Mark Wood taken aback by incredible CSK legend
  • లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య పోరు     
  • తాను, కేఎల్ రాహుల్ ముందుగానే దీనిపై మాట్లాడుకున్నట్టు మార్క్ వుడ్ వెల్లడి
  • పరుగులు చేయనీయకుండా అవుట్ చేయాలన్నది ప్రణాళికగా పేర్కొన్న వుడ్
లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య పోరు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని పంచింది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు మ్యాచ్ చవర్లో కావాల్సినంత కిక్కు ఇచ్చారు. 20వ ఓవర్లో ధోనీ వరుసగా రెండు బంతులను సిక్సర్లుగా కొట్టడంతో స్టేడియంలోని అభిమానులు కేరింతలు కొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లతో ప్రత్యర్థి ఓటమిని శాసించిన లక్నో బౌలర్ మార్క్ వుడ్, చెన్నై జట్టు బ్యాటర్లనూ తన బంతితో ఇబ్బంది పెట్టాడు.

కానీ, మార్క్ వుడ్ బౌలింగ్ లో ధోనీ ఏ మాత్రం తడబడలేదు. సిక్సర్ల మోత మోగించాడు. దీనిపై మార్క్ వుడ్ మీడియాతో మాట్లాడుతూ.. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, తాను వేసుకున్న ప్రణాళిక మేరకే ధోనీకి బంతులు సంధించినట్టు చెప్పాడు. ‘‘నేను, కేఎల్ దీనిపై ముందే మాట్లాడుకున్నాం. ప్రశాంతంగా ఉండడం ద్వారా అతడి వికెట్ ను ఎలా రాబట్టాలనేది చూశాం. నా వరకు రక్షణాత్మకంగా ఉండకూడదని అనుకున్నాను. పరుగులు చేయనీయకుండా ధోనీని కట్టడి చేసి, అవుట్ చేయాలని అనుకున్నాను. దురదృష్టం కొద్దీ 12 పరుగులు సమర్పించుకున్నాను. కానీ, ధోనీ కొట్టిన రెండో షాట్ నిజంగా అద్భుతం’’ అని మార్క్ వుడ్ పేర్కొన్నాడు. క్రికెట్ లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ధోనీకి సాధ్యం కానిది ఉంటుందా..?

నిజానికి 2018లో ధోనీ సారథ్యంలోనే మార్క్ వుడ్ తన ఐపీఎల్ జర్నీ ఆరంభించడం గమనార్హం. ‘‘ధోనీ బ్యాటింగ్ కు దిగినప్పుడు, తిరిగి అతడు సిక్సర్లు కొట్టినప్పుడు నేను విన్న అరుపులు ఎంతో బిగ్గరగా ఉన్నాయి. నిజంగా కళ్లు తెరిపించేది. గొప్ప అనుభవం కూడా’’ అని వుడ్ పేర్కొన్నాడు.
MS Dhoni
sixers
lsg
ipl
mark wood

More Telugu News