Canada: కెనడాలోని హిందూ దేవాలయం గోడలపై భారత వ్యతిరేక రాతలు

  • ఓంటారియోలోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసుకున్న నిందితులు
  • ప్రహరీ గోడపై భారత్ ముర్దాబాద్, మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలని రాతలు
  • ఘటన తాలూకు వీడియోను విడుదల చేసిన స్థానిక పోలీసులు 
  • నిందితుల ఆచూకీ కనుక్కోవడంలో సహకరించాలని స్థానికులకు విజ్ఞప్తి
Hindu temple in Canada vandalised with anti India graffiti 2nd incident in four months

కెనడాలో ఓంటారియో ప్రావిన్స్‌లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అమర్యాదకర రాతలు రాశారు. ‘భారత్ ముర్దాబాద్’, ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’ అంటూ స్పెయర్‌తో పెయింట్ చేశారు. నిందితులు దేవాలయంపై విషం చిమ్ముతుండగా రికార్డైన సీసీటీవీ ఫుటేజీని విండ్సార్ పోలీసులు తాజాగా విడుదల చేశారు. 

బుధవారం అర్ధరాత్రి నిందితులు దేవాలయం ప్రహరీగోడపై రాస్తుండం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. కాగా.. నిందితులను పట్టుకునేందుకు సహకరించాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. తమ సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మనసులో ద్వేషం నింపుకుని నిందితులు ఈ చర్యకు పాల్పడ్డట్టు భావిస్తున్న పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఏడాది జనవరి 31 కూడా కొందరు ఇదేవిధంగా ఓ హిందు దేవాలయాన్ని టార్గెట్ చేసుకున్నారు. బ్రాంప్టన్లోని ఓ గుడి గోడలపై అసభ్యకరమైన రాతలు రాశారు.

More Telugu News