ఆదిపురుష్ నుంచి హనుమాన్ జయంతి కానుక
- హనుమంతుడి పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం
- హనుమంతుడి పాత్రలో నటించిన దేవదత్త నాగే
- జూన్ 16న విడుదల కాబోతున్న చిత్రం
రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16న విడుదల కాబోతోంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఈ మధ్యే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలను రివీల్ చేసేలా ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదిపురుష్‌లో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్లు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.