Adipurush: ఆదిపురుష్ నుంచి హనుమాన్ జయంతి కానుక

On Hanuman Jayanti A New Poster Of Devdatta Nage As Hanuman revealed from Adipurush
  • హనుమంతుడి పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం
  • హనుమంతుడి పాత్రలో నటించిన దేవదత్త నాగే
  • జూన్ 16న విడుదల కాబోతున్న చిత్రం
రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా నుంచి హనుమాన్ జయంతి కానుక వచ్చింది. సినిమాలోని హనుమంతుని పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఆదిపురుష్’లో హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. హనుమంతుడు తన మనస్సులో శ్రీరామ అని తలచుకుంటూ.. తపస్సు చేస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీరామ పాత్రదారి అయిన ప్రభాస్  కనిపిస్తున్నారు. ‘రాముడి భక్తుడు.. రామ కథకి ప్రాణం.. జై పవనపుత్ర హనుమాన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16న విడుదల కాబోతోంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఈ మధ్యే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలను రివీల్ చేసేలా ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదిపురుష్‌లో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్‌లు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
Adipurush
Prabhas
Hanuman Jayanti

More Telugu News