Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Notification Released for TSWRS Posts
  • మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం
  • 2,008 లెక్చరర్ పోస్టులు, 868 అధ్యాపక పోస్టుల భర్తీ
  • లైబ్రేరియన్, మ్యూజిక్, క్రాఫ్ట్స్, టీజీపీ పోస్టులు కూడా
  • ఈ నెల 12 నుంచి వన్‌టైం రిజస్ట్రేషన్ ప్రారంభం
  • 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్, 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతూ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది.

జూనియర్ కళాశాలల్లో 2,008 లెక్చరర్ పోస్టులు, పాఠశాలల్లో 1,276 పీజీటీ, 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్స్, 124 మ్యూజిక్, 4,020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే, డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపక పోస్టులతోపాటు ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను కూడా భర్తీ చేయనుంది.
Telangana
TS Gurukul Recruitment
TSWRS
TREIRB

More Telugu News