Arun Vijay: అంచ‌నాల‌ను పెంచేస్తున్న ‘మిషన్: చాప్ట‌ర్ 1’ టీజ‌ర్‌

  • అరుణ్ విజయ్ హీరోగా 'మిషన్ - చాఫ్టర్ 1'
  • కథానాయికగా కనిపించనున్న అమీ జాక్సన్
  • యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే కథ 
  • హైలైట్ గా నిలవనున్న జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
Mission Movie Teaser Released

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను రూపొందిస్తూ, వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌రన్‌. ఈ ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు, వైవిధ్య భరితమైన క‌థాంశాలున్న సినిమాల‌కు డిస్ట్రిబ్యూష‌న్ ప‌రంగానూ అండగా నిలుస్తోంది. అందుక‌నే సినీ ప్రేమికుల‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ గురించిన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. 

ఇప్పుడ‌లాంటి లిస్టులోకి చేరిన మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం ‘మిషన్: చాప్ట‌ర్ 1’. ‘ఫియర్‌లెస్ జ‌ర్నీ’ ట్యాగ్ లైన్. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాను విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మించారు. కొంతసేపటి క్రితం ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ‘మిషన్: చాప్ట‌ర్ 1’ను గ‌మ‌నిస్తే ఇది  లండ‌న్‌లోని 'వాండ్స్ వ‌ర్త్'  జైలు బ్యాక్ డ్రాప్‌లో న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచంలోని ఖైదీలంద‌రూ ఆ జైలులో ఉంటారు. ఆ జైలును సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఎమీ జాక్స‌న్ న‌టిస్తుంది. ఇక ఆ జైలులో ఓ ఖైదీగా హీరో అరుణ్ విజ‌య్ కనిపిస్తాడు. ఫ్యామిలీతో  ఇండియా నుంచి లండ‌న్ వ‌చ్చిన అరుణ్ విజ‌య్‌ని అక్క‌డి పోలీసులు అరెస్ట్ చేస్తారు. త‌న కుమార్తెకు మ‌రో రెండు రోజుల్లో ఆప‌రేష‌న్ ఉంటుంది. త‌నేమో జైలులో ఉంటాడు. అస‌లేం జరిగింది? అందుకు కారణాలు ఏమిటి? అనేదే కథ. 

అద్భుతమైన స‌న్నివేశాలు, ఆక‌ట్టుకునే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ‘మిషన్: చాప్ట‌ర్ 1’ టీజ‌ర్ సూప‌ర్బ్‌గా ఉంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ బీజీఎం సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంద‌న‌టంలో డౌటేలేద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. డైరెక్ట‌ర్ విజ‌య్ త‌న‌దైన ప్లానింగ్‌తో ఇంత భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని 70 రోజుల్లోనే పూర్తి చేశారు. హీరో అరుణ్ విజ‌య్ రిస్కీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో డూప్ లేకుండా న‌టించారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆయ‌న యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉన్నాయి. 

More Telugu News