Raviteja: 'రావణాసుర' నుంచి థీమ్ వీడియో సాంగ్ రిలీజ్

  • 'రావణాసుర'గా కనిపించనున్న రవితేజ
  • కథానాయికలుగా ఐదుగురు హీరోయిన్స్ సందడి
  • సంగీతాన్ని సమకూర్చిన  హర్షవర్ధన్ రామేశ్వర్ 
  • ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల 
Ravansura lyrical song released

రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆయన క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత్ పొన్నాడ కథానాయికలుగా అలరించనున్నారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రావణా .. రావణా .. రావణా .. దశగ్రీవ .. రావణా' అంటూ ఈ పాట సాగుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలోని ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా అరుణ్ కౌండిన్య ఆలపించారు. 

ఈ సినిమాలోని ఐదుగురు హీరోయిన్స్ లో ప్రధానమైన నాయిక ఎవరు? హీరో పాత్రకే నెగెటివ్ షేడ్స్ ఉంటే .. అసలు విలన్ ఎవరు? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకు ఈ సినిమా మాత్రమే సమాధానం చెబుతుందనేది మేకర్స్  మాట. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News