MS Dhoni: ధోనీకి సూపర్ హీరో కాస్ట్యూమ్.. అభిమానులకు ఆనంద్ మహీంద్రా పిలుపు

Anand Mahindra Asks For A Superhero Costume For MS Dhoni Internet Comes Up With Brilliant Results
  • మహీంద్రాను కట్టిపడేసిన ధోనీ అద్భుత బ్యాటింగ్  
  • ధోనీ యూనిఫామ్ కు ఓ కేప్ తగిలించాలంటూ సీఎస్కేకు సూచన
  • లక్నో జట్టుపై ధోనీ సిక్సర్ల మోతకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా
  మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లక్నో జట్టు పై మ్యాచ్ లో భాగంగా.. రెండు సిక్సర్లతో రెచ్చిపోవడం తెలిసిందే. 20వ ఓవర్లో వచ్చి వరుసగా రెండు బంతులను సిక్సర్లుగా బాది మూడో బంతికి ధోనీ అవుటయ్యాడు. 

ధోనీ అద్భుత బ్యాటింగ్ ఆనంద్ మహీంద్రాను కట్టి పడేసింది. ధోనీని సూపర్ హీరోగా సంబోధించారు. ధోనీ యూనిఫామ్ కు సూపర్ మ్యాన్ మాదిరిగా కేప్ (రెక్కుల మాదిరి)ను ఏర్పాటు చేయాలంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సూచించారు. అంతేకాదు ధోనీకి ప్రత్యేక యూనిఫామ్ డిజైన్లు సూచించాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. వాటిల్లో మంచి డిజైన్ ను ధోనీ యూనిఫామ్ కోసం సీఎస్కే తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ధోనీకి అభిమానుల సంఖ్య ఎక్కువే. మరి ఆనంద్ మహీంద్రా పిలుపును వారు ఎందుకు పెడచెవిన పెడతారు? చాలా మంది తమదైన సూపర్ హీరో క్యాస్ట్యూమ్ డిజైన్లను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు.  
MS Dhoni
csk
Superhero
Costume
Anand Mahindra

More Telugu News