Telangana: పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదం: కేటీఆర్

Telangana Minister KTR Reacts on Bandi Sanjay Arrest
  • బండి సంజయ్ అరెస్టుపై ట్వీట్ చేసిన తెలంగాణ మంత్రి
  • విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్
  • స్వార్థ రాజకీయాలకు విద్యార్థులను బలిపెడుతున్నారని ఫైర్
పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ విషయంపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదమంటూ మంత్రి ట్వీట్ చేశారు. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీజేపీ.. పేపర్ లీకేజీ కుట్రలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్.. అంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.

మంత్రి ట్వీట్ యథాతథంగా..

పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం...!! 
కానీ, 
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం...!!!

తమ స్వార్థ రాజకీయాల కోసం 
ప్రశ్నా పత్రాలు లీక్ చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు..

Telangana
BRS
BJP
KTR
Bandi Sanjay arrest
paper leak

More Telugu News