హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. యువకుడిని కాల్చి చంపిన దుండగులు
- టప్పాచబుత్రా పరిధిలోని ఓ హోటల్ సమీపంలో ఘటన
- కాల్పుల్లో ఆకాశ్ సింగ్ అనే వ్యక్తి మృతి
- పాత గొడవలే కారణమని భావిస్తున్న పోలీసులు
పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. క్రాంతి అనే యువకుడికి, ఆకాశ్ కి గతంలో గొడవలు ఉన్నాయని ఈ పని వారే చేసుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తోప్‌ఖానా ఏరియాలో భారీగా పోలీసులను మోహరించారు. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.