Hyderabad: హైదరాబాద్‌లో భానుడి భగభగలు.. బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల నమోదు

  • పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
  • నేటి సాయంత్రం నగరంలో తేలికపాటి వర్షం పడే అవకాశం
  • గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం
Hyderabad Records Over 40 Degrees Temperature Yesterday

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో భానుడు చెలరేగిపోతున్నాడు. నగరంలోని బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఖైరతాబాద్‌లో 40.1, శేరిలింగంపల్లిలో 39.9, షేక్‌పేటలో 38.9, మియాపూర్‌లో 38.7, సరూర్‌నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న 25 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ వెల్లడించింది. కాగా, నగరంలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం, రాత్రి వేళలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణకేంద్రం తెలిపింది. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నెల 3న గరిష్ఠంగా 69.10 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది.

More Telugu News