Bandi Sanjay: కేసీఆర్ కు ఉగ్రవాద సంస్థలేమైనా ఆర్థికసాయం చేస్తున్నాయా?: బండి సంజయ్

Bandi Sanjay take jibe at CM KCR
  • కేసీఆర్ కు వేల కోట్లు ఎక్కడ్నించి వచ్చాయన్న బండి సంజయ్
  • ప్రతిపక్షాలకు పెట్టుబడి పెట్టే స్థాయికి కేసీఆర్ ఎలా ఎదిగారంటూ వ్యాఖ్యలు
  • ప్రజల డబ్బుతో దేశ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోమారు ధ్వజమెత్తారు. కేసీఆర్ కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దేశంలోని ప్రతిపక్షాలకు డబ్బులు ఖర్చుపెట్టే స్థాయి కేసీఆర్ కు ఎలా సాధ్యమైంది? అని నిలదీశారు. టెర్రరిస్టు, ఇతర సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా? అని సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఎలా ఉన్నాడు? ఇప్పుడెలా ఉన్నాడు? అని వ్యాఖ్యానించారు. 

ప్రజల నుంచి దోపిడీ చేసిన సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు.  కేసీఆర్ కుటుంబం ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలే తగిన జవాబు ఇస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, మోదీ విద్యార్హతల సర్టిఫికెట్ నేపథ్యంలోనూ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ తన విద్యార్హతల సర్టిఫికెట్ ను బయటపెట్టాలని అన్నారు.
Bandi Sanjay
KCR
BJP
BRS
Telangana

More Telugu News