Poorna: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి పూర్ణ

Actress Poorna gives birth to baby boy
  • దుబాయ్ లో ఉన్న వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న పూర్ణ
  • పూర్ణ తల్లి కావడంతో ఆనందంలో అభిమానులు
  • నాని 'దసరా' చిత్రంలో నటించిన పూర్ణ
సినీ నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. పూర్ణ తల్లి అయిందనే వార్తతో ఆమె అభిమానులు సంతోషానికి గురవుతున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళం సినిమాల ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ దుబాయ్ లో ఉన్న వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. 

ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీమంతం ఫొటోలు వైరల్ అయ్యాయి. తాను గర్భవతి అయినట్టు గత డిసెంబర్ లో ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించింది. సినిమాల విషయానికి వస్తే నాని తాజా చిత్రం 'దసరా'లో ఆమె నటించింది.
Poorna
Mother
Delivery
Tollywood

More Telugu News