UK minister: బ్రిటిష్ పాకిస్థానీలపై బ్రిటన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • బ్రిటిష్ పాకిస్థానీ పురుషులు.. ఇంగ్లిష్ బాలికలపై లైంగిక దాడులు చేస్తున్నారన్న సువెల్లా బ్రేవర్మన్
  • ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’ లో వాళ్లు ఉంటున్నారని ఆరోపణ
  • బ్రిటిష్ పాకిస్థానీ మగవారు.. హేయమైన విధానాలను అనుసరిస్తారని విమర్శ 
UK minister says Pakistani men raping English girls sparks outrage

బ్రిటిష్ హోమ్ సెక్రటరీ (మంత్రి) సువెల్లా బ్రేవర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థానీ పురుషులు.. ఇంగ్లిష్ అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు. బాలికలపై లైంగిక దాడులు చేస్తున్న ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’ ఆగడాలు పెరిగిపోయాయని, ఇందులో బ్రిటిష్ పాకిస్థానీ పురుషులు కూడా ఉన్నారని చెప్పారు. పిల్లలపై లైంగిక వేధింపులను అంతం చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. 
 
‘‘ఇంగ్లిష్ బాలికలను వెంబడించడం, అత్యాచారం చేయడం, మత్తు పదార్థాలు ఇవ్వడం, హాని చేయడం.. వంటి వాటికి పాల్పడే గ్రూమింగ్ గ్యాంగ్‌లలో సభ్యులుగా బ్రిటీష్ పాకిస్థానీ పురుషులు ఉంటున్నారు’’ అని చెప్పారు. ‘స్కై న్యూస్’ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఆమె వెనక్కి తగ్గలేదు.

‘‘ఇంగ్లిష్ అమ్మాయిలు టార్గెట్ అవుతున్నారు. లైంగిక దాడికి గురవుతున్నారు. ఇందులో బ్రిటిష్ పాకిస్థానీ ముఠాల హస్తం ఉంది’’ అని ఆరోపించారు. ‘‘బ్రిటిష్ పాకిస్థానీ మగవారు.. బ్రిటిష్ విలువలకు పూర్తిగా విరుద్ధమైన సాంస్కృతిక విలువలను కలిగి ఉంటారు. స్త్రీలను అవమానకర రీతిలో చూస్తారు. హేయమైన విధానాలను అనుసరిస్తారు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News