Avalanche: సిక్కింలో మంచు తుపాను... ఆరుగురి మృతి

  • నాథూలా సరిహద్దు వద్ద మంచు తుపాను
  • పర్యాటకులను కప్పేసిన మంచు
  • ఇప్పటివరకు 22 మందిని కాపాడిన అధికారులు
  • 12 మందికి గాయాలు
Avalanche in Sikkim killed six people

సిక్కింలో మంచు తుపాను సంభవించింది. నాథూలా సరిహద్దు వద్ద మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృత్యువాతపడ్డారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిక్కిం పోలీసులు, రాష్ట్ర టూరిజం అధికారులు, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. 

మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంచు తుపాను సంభవించింది. పర్యాటకులు తప్పించుకునేలోపే వారిని భారీ మంచుచరియలు కప్పేశాయి. మంచు కింద ఇంకా చాలామంది పర్యాటకులు ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 22 మందిని కాపాడారు.

More Telugu News