TG Venkatesh: బీజేపీ, జనసేనల పొత్తు కొనసాగుతుంది: టీజీ వెంకటేశ్

Alliance between BJP and Janasena will continue says TG Venkatesh
  • బీజేపీతో పొత్తు లేకపోతే వైసీపీతో పవన్ కొట్లాడలేరన్న టీజీ వెంకటేశ్
  • ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులపై క్లారిటీ వస్తుందని వ్యాఖ్య
  • వైసీపీ పని అయిపోయిందనే విషయం ప్రజల్లోకి వెళ్లిపోయిందన్న టీజీ
వైసీపీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొట్లాడాలంటే బీజేపీతో పొత్తు ఉండాలని... బీజేపీతో పొత్తు లేకపోతే పవన్ పోరాడలేరని బీజేపీ నేత టీజీ వెంకటేశ్ అన్నారు. బీజేపీతో పవన్ కలిసుంటే తమకు కూడా లాభమేనని చెప్పారు. బీజేపీ, జనసేనల పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు. 

భవిష్యత్ కార్యాచరణ గురించి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పవన్ మాట్లాడి ఉండొచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయం గురించి కూడా మాట్లాడి ఉండొచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందనే విషయం ప్రజల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. ఒక్క సారి ఇలాంటి సందేశం ప్రజల్లోకి వెళ్తే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని అన్నారు.
TG Venkatesh
BJP
Pawan Kalyan
Janasena

More Telugu News