మార్గదర్శి అయినా, జగన్ అయినా విచారణను ఎదుర్కోవాల్సిందే: ఉండవల్లి అరుణ్ కుమార్
- మార్గదర్శి అయినా, జగన్ అయినా విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న ఉండవల్లి
- తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలను ఇచ్చానని జగన్ తనతో చెప్పారని వ్యాఖ్య
- చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న ఉండవల్లి
చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఉండవల్లి అన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ ఆరోపించిందని, జరగలేదని జగన్ చెపుతున్నారని.. ఈ అంశంపై కోర్టులో పోరాడాల్సిందేనని చెప్పారు. మోదీ, అమిత్ షాలు వారిపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారని, జగన్ తనపై కేసులను ఎందుకు కొట్టేయించుకోలేకపోయారని ప్రశ్నించారు. జగన్ పై ఉన్న కేసులు ఆర్థిక నేరాలకు సంబంధించినవి కావడం వల్లే ఆయన కేసులు కొట్టేయించుకోలేకపోయారని అన్నారు.