Adithi Rao Hydari: ఈ వారం ఓటీటీ సెంటర్స్ లో వెబ్ సిరీస్ లు .. సినిమాలు ఇవే!

  • ఈటీవీ విన్ లో రేపటి నుంచి 'అసలు' స్ట్రీమింగ్
  • నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 6 నుంచి 'బీఫ్' వెబ్ సిరీస్  
  • డిస్నీ హాట్ స్టార్ లో ఈ నెల 7 నుంచి 'రోమాంఛమ్'
  • జీ 5లో ఈ నెల 7 నుంచి 'అయోథి' స్ట్రీమింగ్

OTT Movies Releasing in this Week

గతంలో శుక్రవారం వస్తుందంటే ఏ థియేటర్ లో ఏ సినిమా ఆడుతోంది అనే ఆసక్తి అందరిలోనూ ఉండేది. ఇక ఇప్పుడు థియేటర్స్ లో సినిమాల గురించి మాత్రమే కాదు, ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఏయే సినిమాలు వస్తున్నాయనే విషయం పట్ల కుతూహలాన్ని కనబరుస్తున్నారు. ఇక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా అందరిలో ఆసక్తిని పెంచుతుండటం విశేషం.

ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెడుతున్న సినిమాలు .. వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే, నెట్ ఫ్లిక్స్ లో 'బీఫ్' (వెబ్ సిరీస్) .. 'ఇన్ రియల్ లవ్' (టీవీ షో) ఏప్రిల్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. 'చుపా' (హాలీవుడ్) ఈ నెల 7వ తేదీ నుంచి, 'హంగర్' (హాలీవుడ్) ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. జీ 5లో 'అయోథి' ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మలయాళ చిత్రం 'రోమాంఛమ్' ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదితీరావు ప్రధాన పాత్రగా, అమెజాన్ ప్రైమ్ లో 'జూబ్లీ' (వెబ్ సిరీస్) ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  ఈటీవీ విన్ లో తెలుగు సినిమా 'అసలు' ఈ నెల 5 వతేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రవిబాబు - పూర్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు.

More Telugu News