Farmers: జీవో నెం.45పై హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు

Farmers approach AP High Court over GO No 45
  • సీఆర్డీఏ పరిధిలో ఇతర జిల్లాల వారికి భూముల కేటాయింపు
  • జీవో నెం.45 తీసుకువచ్చిన ప్రభుత్వం
  • లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన అమరావతి రైతులు
ఇతర జిల్లాల వారికి అమరావతిలో ఇళ్లు కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో నెం.45ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాజధాని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జీవో నెం.45ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 

సీఆర్డీఏ పరిధిలో 1,130 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కింద కేటాయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో నెం.45 తీసుకువచ్చారు. అయితే ఆ భూములను ఇతరులకు కేటాయిస్తుండడాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Farmers
GO No 45
AP High Court
Amaravati
AP Capital

More Telugu News