Janhvi Kapoor: బోయ్ ఫ్రెండ్ తో కలసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor and boyfriend Shikhar Pahariya seek blessings at Tirupati Balaji Temple
  • ఆలయం ముందు దర్శనమిచ్చిన జాన్వీ కపూర్
  • ఆమె వెంట శిఖర్ పహారియా, ఖుషీ కపూర్
  • స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు
ఎన్టీఆర్ 30తో తెలుగు అభిమానులను తొలిసారి పలకరించనున్న జాన్వీ కపూర్.. తిరుమల శ్రీవారిని తన బోయ్ ఫ్రెండ్ తో కలిసి సోమవారం దర్శించుకుంది. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా శ్రీవారి సన్నిధి వద్ద సోమవారం ఉదయం మీడియా కెమెరాల కంటపడ్డారు. వీరిద్దరూ గతంలో పలు వేడుకలకు కలిసి హాజరు కావడం తెలిసే ఉంటుంది. వీరిద్దరూ తిరుమలలో ప్రత్యక్షం కావడం అభిమానుల్లో ఆసక్తికి దారితీసింది. జాన్వీతోపాటు, ఆమె సోదరి ఖుషీ కపూర్ స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేయడం గమనార్హం. 

జాన్వీ కపూర్ లంగా ఓణి లో కనిపించింది. శిఖర్ పహారియా మాత్రం తెల్లటి పంచె, రెడ్ స్క్రాఫ్ లో కనిపించాడు. వీరి వెంట ఖుషీ కపూర్ కూడా ఉంది. గత వారాంతంలో శిఖర్ పహారియా ఓ కార్యక్రమంలో భాగంగా జాన్వీ తండ్రి బోనీ కపూర్ పక్కనే కనిపించడం గమనార్హం. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. జాన్వీతో అతడు ఎంతో కాలంగా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మధ్యలో వీరి బంధానికి బ్రేక్ వచ్చినప్పటికీ.. గతేడాది డిసెంబర్ లో మరోసారి దగ్గరయ్యారు.
Janhvi Kapoor
Boy friend
Shikhar Pahariya
tirumala
srivari
darsanam
kushi kapoor

More Telugu News