అతిథులకు రూ.500 నోట్లతో స్వీట్లు వడ్డించిన అంబానీలు.. ట్విస్ట్ ఏంటంటే?
- ముంబైలో గతవారం నీతా ముఖేశ్ అంబానీ కల్బరల్ సెంటర్ ప్రారంభం
- అట్టహాసంగా జరిగిన వేడుకకు తరలివచ్చిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు
- తమదైన శైలిలో ఆతిథ్యం ఇచ్చిన అంబానీ కుటుంబం
వారందరికీ అంబానీ కుటుంబం అసాధారణ ఆతిథ్యం ఇచ్చింది. అతిథులకు వడ్డించిన ఆహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరీ ముఖ్యంగా భోజనం తర్వాత అందించిన స్వీట్ ప్లేట్లలో రూ. 500 నోట్లు ఉండటం చర్చనీయాంశమైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్వీట్ పేరు దౌలత్ కి చాట్. నార్త్ ఇండియాలో బాగా ఫేమస్. అయితే, వాటి చుట్టూ పేర్చిన 500 రూపాయల నోట్లు అసలైనవి కావట. బొమ్మ నోట్లు. అలంకరణ కోసమే వాటిని అలా పేర్చి అతిథులుకు స్వీట్లు అందించారు.