Anurag Thakur: రాహుల్ గాంధీ మరో పది జన్మలెత్తినా సావర్కర్ కాలేడు: అనురాగ్ ఠాకూర్

Anurag Thakur take a jibe at Rahul Gandhi
  • సావర్కర్ ను రాహుల్ అవమానించారన్న ఠాకూర్
  • రాహుల్ ను దేశం ఎన్నటికీ క్షమించబోదని వెల్లడి
  • ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడని విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీర సావర్కార్ ను అవమానించిన రాహుల్ గాంధీని దేశం ఎన్నటికీ క్షమించబోదని అన్నారు. 

రాహుల్ మరో 10 జన్మలెత్తినా సావర్కర్ కాలేడని ఎద్దేవా చేశారు. సావర్కర్ తన జీవితాంతం స్వాతంత్ర్యం కోసం పోరాడితే, బ్రిటిష్ వాళ్ల సాయంతో రాహుల్ తన జీవితమంతా భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడని అన్నారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద జీతో అహింసా రన్ ప్రారంభోత్సవం సందర్భంగా అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

మోదీ అనే ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పార్లమెంట సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు పడింది. 

ఈ సందర్భంగా రాహుల్ స్పందిస్తూ... "నా పేరు సావర్కర్ కాదు... నా పేరు రాహుల్ గాంధీ... గాంధీలు ఎవరికీ క్షమాపణలు చెప్పరు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ సహా కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి
Anurag Thakur
Rahul Gandhi
Veer Savarkar
BJP
Congress
India

More Telugu News