Telangana: గద్వాల్ కలెక్టర్‌తో వివాదం.. కన్నీరుమున్నీరైన జెడ్పీ సీఈఓ

Gadwal collector surrenders ZP CEO to government
  • గద్వాల్ జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం
  • విధుల పట్ల జెడ్పీ సీఈఓ నిర్లక్ష్యంగా ఉంటున్నారని కలెక్టర్ ఆరోపణ
  • సీఈఓను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్
  • మంత్రి నిరంజన్ రెడ్డికి జెడ్పీ సీఈఓ ఫోన్
  • తనపై కక్ష సాధిస్తున్నారంటూ కన్నీరుమున్నీరైన సీఈఓ
గద్వాల జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ మధ్య వివాదం ముదిరింది. కలెక్టర్ వల్లూరి క్రాంతి తనను రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని జెడ్పీ సీఈఓ విజయ నాయక్ ఆరోపించారు. తనను కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి తన గోడును వెళ్లబోసుకుని విలపించారు. అంతేకాకుండా.. ప్రభుత్వ పథకాలపై కలెక్టర్ వల్లూరి క్రాంతికి అవగాహన లేదని కూడా ఆరోపించారు. ప్రజలకు నిస్వార్థంగా సేవచేస్తున్నానని మంత్రికి చెప్పుకొచ్చారు. తనపై కక్ష సాధిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. 

జెడ్పీ సీఈఓ తన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తుండటంతోనే ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి వచ్చిందని కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు.
Telangana

More Telugu News