Heat: 3 నెలలు మండిపోనున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్న రాష్ట్రాలు ఇవే!

High temperatures to be recorded from April to June in many states of India
  • ఏప్రిల్ నుంచి జూన్ వరకు బెంబేలెత్తించనున్న ఎండలు
  • తూర్పు, మధ్య, వాయవ్య భారతదేశంలో హీట్ వేవ్
  • ఈ నెలలో పలు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం 
ఎండలు అప్పుడే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది ఇండియాలో పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు తూర్పు, మధ్య, వాయవ్య భారతదేశ ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 

హీట్ వేవ్ కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఈ నెలలో పలు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Heat
Temperatures
India

More Telugu News