Chandrababu: చంద్రబాబును కలిసి ఆశీస్సులు అందుకున్న టీడీపీ నూతన ఎమ్మెల్సీలు

TDP MLCs met TDP Chief Chandrababu
  • నేడు ప్రమాణస్వీకారం చేసిన నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు
  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రాక
  • నూతన ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున వేపాడ చిరంజీవిరావు (ఉత్తరాంధ్ర), కంచర్ల శ్రీకాంత్ (తూర్పు రాయలసీమ), భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (పశ్చిమ రాయలసీమ) విజయం సాధించడం తెలిసిందే. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ టీడీపీ తరఫున జయకేతనం ఎగురవేశారు. ఈ నలుగురు ఇవాళ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

శాసన మండలిలో ప్రమాణ స్వీకారం అనంతరం వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పంచుమర్తి అనురాధ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు నూతన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మంచి ప్రజా ప్రతినిధులుగా పేరు తెచ్చుకోవాలని వారికి సూచించారు.
Chandrababu
MLCs
TDP
Andhra Pradesh

More Telugu News