23 ఏళ్లకే బళ్లారి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన యువతి!
- ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసిన త్రివేణి
- 18 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి
- 21 ఏళ్లకే కార్పొరేటర్‌గా విజయం
- డిప్యూటీ మేయర్‌గా బి.జానకి
నిన్న జరిగిన మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి అతి పిన్న వయసులోనే బళ్లారికి మేయర్ అయిన ఘనత సాధించారు. ఫార్మసీలో డిప్లొమా పూర్తిచేసిన త్రివేణి ఏడాది పాటు మేయర్‌గా కొనసాగుతారు. ఆమె తల్లి సుశీలాబాయి కూడా 2019-20 మధ్య బళ్లారి మేయర్‌గా పనిచేశారు.
ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. తాను 21 సంవత్సరాలకే కార్పొరేటర్‌గా విజయం సాధించానని, ఇప్పుడు 23 ఏళ్ల వయసులో మేయర్ అయినట్టు చెప్పారు. అందరినీ కలుపుకుంటూ నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. కాగా, డిప్యూటీ మేయర్‌గా బి.జానకి ఎన్నికయ్యారు. 33వ వార్డు సభ్యురాలైన జానకి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.