JC Diwakar Reddy: లోకేశ్ పాదయాత్రలో జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శ

JC Diwakar Reddy meets Nara Lokesh in padayatra
  • 54వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
  • పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో లోకేశ్ ను కలిసిన జేసీ
  • ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పాదయాత్రలో కనిపిస్తోందని వ్యాఖ్య
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర 54వ రోజుకు చేరుకుంది. ఈరోజు పాదయాత్రలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. లోకేశ్ కు సంఘీభావాన్ని ప్రకటించారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా లోకేశ్ కు పూలమాల వేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పాదయాత్రలో కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. జగన్ పై ఉన్న వ్యతిరేకతతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అభద్రతా భావానికి గువుతున్నారని చెప్పారు.
JC Diwakar Reddy
Nara Lokesh
Telugudesam

More Telugu News