Chiranjeevi: అల్లు అర్జున్ కెరీర్ కు 20 ఏళ్లు... చిరంజీవి స్పందన

Chiranjeevi opines on 20 years career of Allu Arjun
  • గంగోత్రితో బన్నీ కెరీర్ ప్రారంభం
  • పుష్ప వరకు అద్భుతంగా సాగిన ప్రస్థానం
  • బన్నీ కెరీర్ తనను ముగ్ధుడ్ని చేసిందన్న చిరంజీవి
  • మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్ష
గంగోత్రితో సినీ హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన అల్లు అర్జున్ నిన్నటి బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప వరకు అద్భుతమైన కెరీర్ ను సొంతం చేసుకున్నాడు. మార్చి 28వ తేదీకి బన్నీ కెరీర్ కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

"డియర్ బన్నీ... నువ్వు సినిమాల్లోకొచ్చి 20 అద్భుతమైన వసంతాలు పూర్తిచేసుకోవడం నా హృదయాన్ని తాకింది. నీ బాల్యానికి చెందిన స్మృతులు ఇంకా తాజాగానే అనిపిస్తున్నాయి. రోజులు ఇట్టే గడిచిపోయాయి! పాన్ ఇండియా స్టార్ గా, ఐకానిక్ స్టార్ గా నిన్ను నువ్వు మలుచుకున్న విధానం నన్ను ముగ్ధుడ్ని చేసింది. రాబోయే కాలంలో మరింత ఎత్తుకు ఎదిగేలా లక్ష్యాలను నిర్దేశించుకుంటావని, మరిన్ని హృదయాలను గెలుచుకుంటావని ఆశిస్తున్నాను" అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో బన్నీతో కలిసున్న ఫొటోను కూడా చిరంజీవి పంచుకున్నారు.
Chiranjeevi
Allu Arjun
Career
20 Years
Tollywood

More Telugu News