Tapsee: హీరోయిన్ తాప్సీపై కేసు నమోదు చేసిన పోలీసులు

Police case on Tapsee
  • ముంబైలో లాక్మే షోలో పాల్గొన్న తాప్సీ
  • అర్ధనగ్నంగా కనిపిస్తూ లక్ష్మీదేవి ఆభరణాన్ని ధరించిన వైనం
  • హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కేసు
సినీ నటి తాప్పీ తెలుగులో తక్కువ సినిమాలే చేస్తున్నప్పటికీ బాలీవుడ్ లో బిజీగానే ఉంటోంది. తాజాగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 14న ముంబైలో నిర్వహించిన లాక్మే షోలో తాప్సీ పాల్గొంది. ఈ షోలో రెడ్ కలర్ డీప్ నెక్ గౌన్ లో అర్ధ నగ్నంగా ఉన్న తాప్సీ... మెడలో రిలయెన్స్ జ్యుయెల్స్ ప్రత్యేకంగా తయారు చేసిన లక్ష్మీదేవి ఆభరణాన్ని ధరించి ర్యాంప్ వాక్ చేసింది.

 దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ (ఇండోర్) కన్వీనర్ ఏకలవ్య సింగ్ గౌర్ ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆమె ప్రవర్తించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాప్పీ ఇంకా స్పందించలేదు.
Tapsee
Tollywood
Bollywood
Case

More Telugu News