Papikondalu: మళ్లీ మొదలైన పాపికొండల విహార యాత్ర.. బోట్లకు అధికారుల అనుమతి

Papikondalu Tour Started again after unseasonal rains
  • అకాల వర్షాల కారణంగా బోట్లకు అనుమతి రద్దు
  • వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ అనుమతులు
  • నిన్న పర్యాటకులతో వెళ్లిన రెండు బోట్లు
పాపికొండల అందాలను తనివితీరా చూసి ఆస్వాదించాలనుకునే వారికి ఇది శుభవార్తే. అకాల వర్షాల కారణంగా ఇటీవల పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో విహారయాత్రకు అధికారులు మళ్లీ పచ్చజెండా ఊపారు. 

కంట్రోల్ రూము వద్ద తనిఖీల అనంతరం పర్యాటక బోట్లకు అనుమతులిచ్చారు. నిన్న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి రెండు బోట్లు పర్యాటకులతో వెళ్లినట్టు అధికారులు తెలిపారు.
Papikondalu
Papikondalu Tour
Tourist Boats

More Telugu News