Atchannaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగనే మర్చిపోయి టీడీపీకి ఓటేశారేమో... ఎవరికి తెలుసు?: అచ్చెన్నాయుడు

  • ఇవాళ హైదరాబాదులో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఖండించిన అచ్చెన్న
  • తమ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని సీఎం జగన్ ను నిలదీసిన వైనం
  • 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వెల్లడి
Atchannaidu condemns YCP allegations on TDP

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగనే మర్చిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ జరుగుతుందని, మరి సీక్రెట్ ఓటింగ్ వివరాలు ఎలా వెల్లడయ్యాయో సజ్జల చెప్పాలని అన్నారు. 

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఖండించారు. వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలని హితవు పలికారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో జగనే చెప్పాలని నిలదీశారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమను సంప్రదించలేదని అన్నారు. 

కాగా, 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. అన్ని అంశాలు సరిచూసుకున్న తర్వాతే ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని చేర్చుకోకూడదో నిర్ణయించుకుంటామని తెలిపారు

More Telugu News