Santosh Sobhan: ఓటీటీలో ఈ వారం తెలుగు సినిమాలు ఇవే!

OTT Movies Releasing This Week
  • ఈ నెల 30వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో 'శ్రీదేవి శోభన్ బాబు'
  • ఏప్రిల్ 1వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో 'అమిగోస్' 
  • అదే రోజున 'ఆహా'కి సత్తిగాని రెండెకరాలు'
  • ఏప్రిల్ 14న అమెజాన్ ప్రైమ్ లో 'కబ్జ' స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ వారంలో రావడానికి కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో ముందుగా 'శ్రీదేవి శోభన్ బాబు' పలకరించనుంది. సంతోష్ శోభన్ - గౌరీ కిషన్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. సుస్మిత కొణిదెల నిర్మాతగా .. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి, థియేటర్స్ నుంచి అంతగా ఆదరణ లభించలేదు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కానుంది. 

ఇక ఏప్రిల్ 1వ తేదీన 'అమిగోస్' సినిమా నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. కల్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా, ఫిబ్రవరి 10వ తేదీన విడుదలైంది. ఈ సినిమాతోనే ఆషిక రంగనాథ్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైంది. కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. 

ఇక ఇదే రోజున 'సత్తిగాని రెండెకరాలు' 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ముందుగా ఉగాదికి స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత వాయిదా వేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, 'పుష్ప' జగదీశ్ ప్రధానమైన పాత్రను పోషించాడు. అభినవ్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక ఏప్రిల్ 5వ తేదీన ఈటీవీ విన్ లో 'అసలు' .. 14వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో 'కబ్జ' స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Santosh Sobhan
Gouri Kishan
Sridevi Sobhan Babu

More Telugu News