Sitharam Yechuri: పార్టీలో బీవీ రాఘవులు వివాదం సమసిపోయింది: సీతారాం ఏచూరి

  • ఏపీ సీపీఎంలో కలకలం రేపిన రాఘవులు రాజీనామా
  • పొలిట్ బ్యూరో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాఘవులు ప్రకటన
  • ఏపీలో పార్టీ నిర్మాణాత్మక అంశాల్లో సమస్యలు ఉన్నాయన్న సీతారాం ఏచూరి
  • వచ్చే సమావేశాల్లో సమస్యలపై దృష్టి పెడతామని వెల్లడి
  • రాఘవులు పొలిట్ బ్యూరో పదవిలో కొనసాగుతారని స్పష్టీకరణ
Sitharam Yechuri responds on BV Raghavulu resignation

ఇటీవల సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో పదవికి సీనియర్ నేత బీవీ రాఘవులు రాజీనామా చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. ఏపీలో పార్టీ నిర్మాణాత్మక అంశాలపై సమస్యలు ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. వీటిపై వచ్చే రాష్ట్ర కమిటీ భేటీల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పార్టీలో రాఘవులు వివాదం సమసిపోయిందని అన్నారు. రాఘవులు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. 

ఏపీ సీపీఎం నేతల్లో విభేదాలున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. సీపీఎం ఏపీ కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక కావడంలో బీవీ రాఘవులు సహకరించారని సొంత పార్టీలోనే ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ ఆరోపణలపై సీపీఎం కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్ ను ఏపీకి పంపాలని నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయంతో మనస్తాపానికి గురైన నేపథ్యంలోనే రాఘవులు రాజీనామా చేశారని కథనాలు వచ్చాయి.

More Telugu News