Worlds longest bus journey: 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర!

Worlds longest bus journey will take 56 days to cross Europe
  • ప్రపంచ రికార్డు కోసం సిద్ధమైన భారత టూర్ ఆపరేటింగ్ కంపెనీ
  • టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ కు బస్సు యాత్ర
  • ఆగస్టు 7న ప్రారంభం.. ఒక్కో టికెట్ సుమారు రూ.20 లక్షలు! 
ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రయాణమిది.. ఒకటీ రెండు కాదు ఏకంగా 56 రోజులపాటు సాగే జర్నీ.. 12 వేల కిలోమీటర్లు.. మధ్యలో 22 దేశాలు చుట్టి వచ్చే యాత్ర. అయితే వెళ్లేది విమానంలోనో, నౌకలోనో అనుకుంటున్నారేమో.. కానే కాదు. కనీసం రైలులో కూడా కాదు. బస్సులో. అవును నిజంగా బస్సులోనే!

భారత్ కు చెందిన ప్రముఖ టూర్ ఆపరేటింగ్ కంపెనీ ‘అడ్వెంచర్స్ ఓవర్ లాండ్’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు రెడీ అయింది. ప్రపంచంలోనే సుదీర్ఘ బస్సు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. టర్కీ (తుర్కియా)లోని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వరకు దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరాన్ని 56 రోజుల్లో పూర్తి చేసేందుకు సకల వసతులతో కూడిన ప్రత్యేక లగ్జరీ బస్సును సిద్ధం చేసింది. 

ఆగస్టు 7న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరనున్న బస్సు అక్టోబరు 1న లండన్ కు చేరుకుంటుందని టూర్ సంస్థ వెల్లడించింది. ఇందులో 30 సీట్లు ఉంటాయి. ఒక్కో టికెట్ రేటును 24,300 డాలర్లు ( సుమారుగా రూ.20 లక్షలు) గా నిర్ణయించారు. 22 దేశాల మీదుగా బస్సు జర్నీ సాగుతుంది. బాల్కన్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, పశ్చిమ యూరప్ ప్రాంతాల మీదుగా లండన్ కు చేరుకుంటుంది. ప్రధాన నగరాల్లో బస్సు ఆగినప్పుడల్లా హోటల్స్ లో డబుల్ షేరింగ్ రూమ్స్ కేటాయిస్తారు.

బస్సులో రెండు నెలలు ఎలా పోవాలబ్బా అని ఆలోచించాల్సిన పని లేదు. ఫుల్ లగ్జరీ ఏర్పాట్లు చేశారట. సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా ఉండేలా బస్సును డిజైన్ చేశారట. వరల్డ్ టూర్ చేయాలని అనుకునే వాళ్లకు ఇదో మంచి అవకాశం.  
Worlds longest bus journey
56 days to cross Europe

More Telugu News