Ramcharan: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేసిన గీతా ఆర్ట్స్

  • నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్న రామ్ చరణ్
  • చరణ్ కు వెల్లువెత్తుతున్న బర్త్ డే గ్రీటింగ్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గీతా ఆర్ట్స్ వీడియో
Geetha Arts releases special video on occasion of Ram Charan birthday

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, బంధువులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ప్రస్తుతం రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని 'నాటునాటు' పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇంకోవైపు చరణ్ కు ఆయన తండ్రి చిరంజీవి కూడా గ్రీటింగ్స్ తెలియజేశారు.

More Telugu News