Nani: లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా 'దసరా': హీరో నాని

  • నాని హీరోగా రూపొందిన 'దసరా'  
  • ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల 
  • ఇది ఒక మెమరబుల్ మూవీ అని చెప్పిన నాని 
  • వెన్నెల రోల్ దక్కడం తన అదృష్టమన్న కీర్తి సురేశ్  

Dasara movie pre release event

నాని హీరోగా 'దసరా' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని జోడీగా కీర్తి సురేశ్ అలరించనుంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ  నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 'అనంతపూర్'లో నిర్వహించారు.

ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. 'దసరా'  సినిమాను చూసినవారు ఎంతకాలమైనా ఆ సినిమాను మరిచిపోలేరు. మనకి 80 ఏళ్లు వచ్చిన తరువాత ఆ సినిమా చూస్తే , ఆ పాత్రలను కలుసుకోవాలని అనిపిస్తుంది. 'నేను లోకల్' తరువాత నేను .. కీర్తి సురేశ్ చేసిన మెమరబుల్ సినిమా ఇది. 'మహానటి'ని మించిన పెర్ఫార్మెన్స్ ఈ సినిమా ఇచ్చిందని నాకు అనిపించింది" అని అన్నాడు.

"దర్శకుడు .. సంగీత దర్శకుడు ఇద్దరూ కూడా ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వలన రాలేకపోయారు. ఫైట్ మాస్టర్ సతీశ్ ఈ సినిమా తరువాత తప్పకుండా బిజీ అవుతాడు. 22 ఎకరాల్లో 'వీర్లపాలెం' సెట్ ను అద్భుతంగా వేసిన అవినాశ్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ నెల 30వ తేదీన అందరూ థియేటర్స్ కి వెళ్లాలి .. టాప్ లేపేయాలి" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో తనకి వెన్నెల పాత్రను ఇచ్చినందుకు .. మరోసారి నాని జోడీగా చేసే ఛాన్స్ వచ్చినందుకు కీర్తి సురేశ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

More Telugu News