Mumbai Indians: డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్: వారియర్స్ కు భారీ టార్గెట్ నిర్దేశించిన ముంబయి ఇండియన్స్

Mumbai Indians set UP Warriorz huge target in WPL Eliminator

  • చివరి అంకానికి చేరుకున్న డబ్ల్యూపీఎల్
  • ఫైనల్ బెర్తు కోసం పోటీపడుతున్న ముంబయి, యూపీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూపీ వారియర్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్

భారత్ లో తొలిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. నాట్ షివర్ అద్భుతంగా ఆడి 38 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలచింది. షివర్ స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. చివర్లో మీలీ కెర్ 19 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసింది. 

హేలీ మాథ్యూస్ 26, యస్తికా భాటియా 21, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 14 పరుగులు చేశారు. వారియర్స్ జట్టు బౌలర్లలో సోఫీ ఎక్సెల్ స్టోన్ 2, అంజలి శ్రావణి 1, పర్శవి చోప్రా 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News