plance crash: ఝార్ఖండ్ లో ఇంటిపై కూలిన చిన్న విమానం.. వీడియో ఇదిగో!

Glider Plane Crashes Into House In Jharkhands Dhanbad
  • పైలట్ తో పాటు బాలుడికి తీవ్ర గాయాలు
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • ఇంట్లో వారికి త్రుటిలో తప్పిన ప్రమాదం
రన్ వే పై నుంచి గాల్లోకి లేచిన కాసేపటికే ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన చిన్న విమానం కంట్రోల్ తప్పి ఇంటిపైన కూలిపోయింది. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ కు, అందులో ప్రయాణిస్తున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిటీ టూర్ లో భాగంగా బర్వాడ్ద ఏర్ స్ట్రిప్ నుంచి గ్లైడర్ విమానం బయల్దేరింది. అరకిలోమీటర్ వెళ్లగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది, ఆపై కంట్రోల్ తప్పి ఓ ఇంటి పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలు ముక్కలైంది.

విమాన ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆకాశంలో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా తమ ఇంటిపై కూలడంతో భయాందోళనలకు గురయ్యామని ఆ ఇంటి యజమాని నీలేశ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ఎవరికీ ఏమీ కాలేదని వివరించారు. కాగా, ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యేనని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే, విచారణ పూర్తయితే కానీ ప్రమాదానికి అసలు కారణమేంటనేది తెలియదని చెప్పారు.
plance crash
crash land on house
jharkhand
dhanbad
pilot
injured

More Telugu News