Rishwi Thimmaraju: 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' టీజర్‌ రిలీజ్!

Krishna Gadu Ante Oka Range teaser released
  • కొత్త హీరో హీరోయిన్లతో 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్
  • ప్రేమకథ నేపథ్యంలో నడిచే సినిమా 
  • డైరెక్టర్ శ్రీవాస్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్
  • దర్శకుడిగా రాజేశ్ దొండపాటి పరిచయం
వెండితెరపై ఇప్పటికే ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. లవ్ స్టోరీలు అనేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జానర్లు. యూత్ ఆడియన్స్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీలను ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' అంటూ రాబోతోన్న ప్రేమకథ మీద సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది.  రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ ని హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాను పెట్లా కృష్ణమూర్తి - వెంకట సుబ్బమ్మ .. శ్రీ లత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా రాజేశ్ దొండపాటి పరిచయం కాబోతున్నాడు. 

'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టింది చిత్ర యూనిట్. 'ఉగాది' సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మరో అప్డేట్ గా ఈ మూవీ టీజర్‌ను వదిలింది. డైరెక్టర్ శ్రీవాస్ రిలీజ్ చేసిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్‌లో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జోనర్లను చూపించారు. 

పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా కలిసి వచ్చేలా ఉన్నాయి. ఈ టీజర్‌లో సాబు వర్గీస్ ఆర్ఆర్ ఆకట్టుకోగా.. ఎస్ కే రఫి కెమెరా పనితనంతో ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో సహజంగా తీసినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి వరికుప్పల యాదగిరి పాటలు రచించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.



Rishwi Thimmaraju
Vismaya Sri
Krishna Gadu Ante Oka Range Movie

More Telugu News