Hyderabad: హైదరాబాదీలకు వాతావరణ శాఖ అలర్ట్
- రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
- నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం
- తప్పనిసరి అయితేనే బయటకు రావాలని సలహా
వర్షాలు తగ్గాయనుకుని స్థిమితపడుతున్న హైదరాబాదీలకు వాతావరణ శాఖ తాజాగా ఓ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ నెల 24, 25 తారీఖుల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షాల స్థాయిని బట్టి నగరంలోని ఆరు జోన్లకు వివిధ అలర్ట్‌లు జారీ చేసింది.
ముఖ్యప్రాంతాలైన చార్మినార్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తప్పనిసరి అయితేనే బయటకు రావాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో వడగళ్లు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.