Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. స్టూడియో ఊగిపోతున్నా వార్తలు చదవడం ఆపని యాంకర్.. వీడియో ఇదిగో!

Mahshriq TV Anchor Continues To Deliver News As Earthquake Shakes Studio
  • ఉత్తర భారతదేశం, పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం
  • వైరల్ అవుతున్న భూకంప వీడియోలు
  • యాంకర్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు
  • అది సరికాదంటున్న మరికొందరు
ఉత్తర భారతదేశం సహా పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతాన్ని కుదిపేసింది. ప్రకంపనలతో ఇళ్లు, కార్యాలయాల్లో వస్తువులు పడిపోతున్న వీడియోలు, సీలింగ్ ఫ్యాన్లు ఊగిపోతున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. తాజాగా వైరల్ అయిన మరో వీడియో విస్తుగొలుపుతోంది. పాకిస్థాన్ పెషావర్‌లోని మాష్రిక్ టీవీ స్టూడియోకు సంబంధించిన వీడియో ఇది. 

న్యూస్ యాంకర్ వార్తలు చదువుతున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. ఆ సమయంలో స్టూడియో ఒక్కసారిగా ఊగిపోయింది. వెనకున్న టీవీలు భయంకరంగా కదిలిపోయాయి. సిబ్బంది భయంతో స్టూడియో నుంచి వెళ్లిపోతుండడం కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే, వార్తలు చదువుతున్న యాంకర్ మాత్రం ధైర్యాన్ని వీడలేదు. స్టూడియో మొత్తం కదులుతున్నా ఆ యాంకర్ మాత్రం వార్తలు చదవడాన్ని ఆపలేదు. అతడి ధైర్యాన్ని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం అలా చేసి ఉండకూడదని, ఏదైనా జరిగితే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని అంటున్నారు.
Pakistan
Hindu Kush
Earthquake
Pakistan TV Anchor
Mahshriq TV

More Telugu News