TSPSC: టీఎస్ పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందే వెలసిన పోస్టర్లు

A satirical poster saying that TSPSC is a xerox center
  • ఇచ్చట ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలు దొరుకుతాయంటూ క్యాప్షన్
  • ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరు, ఫొటోలతో పోస్టర్లు
  • కమిషన్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) కార్యాలయం ఎదురుగా రాత్రికిరాత్రే వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో టీఎస్ పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పెద్ద అక్షరాలతో ప్రింట్ చేసి ఉంది. ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లభిస్తాయంటూ క్యాప్షన్ కూడా జతచేశారు. కమిషన్ పనితీరుపై సెటైరిక్ గా ముద్రించిన ఈ పోస్టర్లను కార్యాలయం ఎదురుగానే గుర్తుతెలియని వ్యక్తులు అంటించారు.

టీఎస్‌పీఎస్సీ బోర్డు నిర్వాకంతో ప్రశ్నాపత్రం లీక్ అయితే పరీక్షలను రద్దు చేసి చేతులు దులుపుకోవడం సరికాదని, రద్దు చేయాల్సింది టీఎస్ పీఎస్సీ బోర్డునే అని పోస్టర్ లో పేర్కొన్నారు. తప్పు చేసిందేమో టీఎస్ పీఎస్సీ బోర్డు.. శిక్ష మాత్రం విద్యార్థులకా? అని ప్రశ్నించారు.

పోస్టర్లలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు..
  • పేపర్ లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి తక్షణమే రాష్ట్రంలోని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి
  • ఈ వ్యవహారంలో సీఎం కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి కేసును సీబీఐకి అప్పగించాలి.
  • టీఎస్ పీఎస్సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని వెంటనే తొలగించాలి. 
  • లీకేజీ కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు నెలకు రూ. 10 వేల చొప్పున పరీక్ష నిర్వహించే వరకు పరిహారం చెల్లించాలి.
TSPSC
posters
xerox center
Hyderabad
satirical posters

More Telugu News