Taj Mahal: 85 ఏళ్ల తల్లికి తాజ్‌మహల్ చూడాలన్న కోరిక.. స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చూపించిన కొడుకు!

Son Fulfills 85 Year Old Mothers Wish To Visit Taj Mahal Brings Her to Agra From Gujarat
  • అనారోగ్యంతో 32 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తల్లి
  • 1200 కిలోమీటర్ల దూరంలోని తాజ్‌మహల్‌కు స్ట్రెచర్‌పైనే తీసుకెళ్లిన కొడుకు
  • పాలరాతి కట్టడాన్ని చూసి మురిసిపోయిన తల్లి

అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 85 ఏళ్ల తల్లికి తాజ్‌మహల్ చూపించి తల్లి చిరకాల కోరికను తీర్చాడో కుమారుడు. స్ట్రెచర్‌పై నుంచే ఆమె తాజ్‌మహల్ చూస్తూ మురిసిపోయింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీం తల్లి రజియా అనారోగ్యం కారణంగా 32 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది. అయితే, ఆమెకు చిన్నప్పటి నుంచి తాజ్‌మహల్ చూడాలన్న కోరిక ఉండేది. ఇదే విషయాన్ని ఆమె తన కుమారుడికి చెప్పింది.

తల్లి చిరకాల వాంఛ తీర్చి ఆమెను సంతోష పెట్టాలని భావించిన కుమారుడు నడవలేని స్థితిలో ఉన్న తల్లిని ఎలా తీసుకెళ్లాలన్న విషయం ఆలోచించాడు. చివరికి స్ట్రెచర్‌పైనే తీసుకెళ్లాలని భావించాడు. 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజ్‌మహల్‌ను తల్లికి చూపించేందుకు వాహనంలో బయలుదేరాడు. భార్యతో కలిసి తాజ్‌మహల్ పరిసరాల్లో స్ట్రెచర్‌పైనే తల్లిని తిప్పుతూ ఆమె చిరకాల కోరికను తీర్చాడు. ప్రేమకు చిహ్నమైన ఆ పాలరాతి కట్టడాన్ని చూసిన రజియా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జీవిత చరమాంకంలో ఉన్న తల్లి కోరికను తీర్చిన ఇబ్రహీంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

  • Loading...

More Telugu News