IPL 2023: పది రోజుల్లో ఐపీఎల్ సమరం.. టికెట్లు ఇలా బుక్ చేసుకోవచ్చు

  • ఈ నెల 31 నుంచి ఐపీఎల్ సీజన్ 2023 ప్రారంభం
  • గుజరాత్, చెన్నై జట్ల మధ్య ఆరంభ మ్యాచ్
  • పేటీఎం ఇన్ సైడర్, బుక్ మై షో ద్వారా టికెట్ల బుకింగ్
  • రూ.800 నుంచి ధరలు ప్రారంభం
step by step guide for booking IPL tickets on PaytM Insider

ఐపీఎల్ 2023 సీజన్ ఈ నెల 31 నుంచి ప్రారంభం అవుతోంది. గుజరాత్ టైటాన్స్ -  చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆరంభ మ్యాచ్ జరగనుంది. రెండు నెలల పాటు ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. కరోనా వచ్చిన నాటి నుంచి ఐపీఎల్ జట్లు మన మైదానాల్లో పెద్దగా ఆడింది లేదు. కానీ, ఈ విడత అలా కాదు. ప్రతీ జట్టు తన స్వరాష్ట్రంలోని క్రికెట్ స్టేడియంలో ఏడు మ్యాచ్ లు ఆడనుంది. 

వీటిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తుంటారు. పోటీ ఎక్కువ కనుక ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఐపీఎల్ 2023 సీజన్ టికెట్ల బుకింగ్ సేవలను పేటీఎం ఇన్ సైడర్, బుక్ మై షో సంస్థలు అందిస్తున్నాయి.  పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్ కు వెళ్లి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే పేటీఎం ఇన్ సైడర్ యాప్ ను మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. 

పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో ‘టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్): టికెట్లు, స్క్వాడ్స్, షెడ్యూల్ అండ్ మోర్’ పేరుతో ఉన్న చోట క్లిక్ చేస్తే అన్ని ఫ్రాంచైజీలు కనిపిస్తాయి. కోరుకున్న ఫ్రాంచైజీ పై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న మ్యాచ్ లు, వాటి టికెట్ ధరలు కనిపిస్తాయి. రూ.800 నుంచి టికెట్ ధరలు ఉన్నాయి. బుక్ మై షో పోర్టల్ లేదా యాప్ లోనూ ఐపీఎల్ టికెట్ల దగ్గర క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తక్కువ ధరలకు లభించే మ్యాచ్ టికెట్లను కూడా చూడొచ్చు. బుక్ చేసుకున్న వారికి మ్యాచ్ జరగడానికి 72 గంటల ముందు టికెట్ హార్డ్ కాపీలు పంపిస్తారు.

More Telugu News