USA: అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు

Biden Nominates Indian Origin Woman As Deputy Chief Of US Finance Agency
  • ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్ 
  • నిషాను నామినేట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు
  • విదేశాంగ, అంతర్జాతీయ వ్యవహారాల్లో నిషాకు విస్తృత  అనుభవం

అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి దక్కింది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్‌ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఒబామా హయాంలోనూ బిస్వాల్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆమె దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఆమె 30 ఏళ్లకు పైగా అనుభవం గడించారు. 

ప్రస్తుతం బిస్వాల్.. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్ట్రాటజీ, గ్లోబల్ ఇనీషియేటివ్స్ కార్యక్రమానికి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ఇండియా, బంగ్లాదేశ్‌లకు సంబంధించి యూఎస్ బిజినెస్ కౌన్సిళ్లకూ నేతృత్వం వహిస్తున్నారు.

USA
  • Loading...

More Telugu News