AP Assembly Session: వాళ్లు మనుషులా..పశువులా: సీపీఐ నేత నారాయణ

  • ఏపీ అసెంబ్లీలో పరిణామాలపై  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన
  • అసెంబ్లీ అరాచకంగా మారిందని వ్యాఖ్య
  • ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని విస్మయం
CPI leader narayana criticizes ap government

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు జరిగిన పరిణామాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. 

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడమేంటి? వారు మనుషులా? పశువులా? బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేతతో ఇలా వ్యవహరించడం తగదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాశలో ఉంది. నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరీ దొంగనోట్లు వేయించుకున్నారు. ఇంత చేసినా ఓడిపోవడంతో నిస్పృహలో కూరుకుపోయారు. అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు.  

గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా? స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉంది. ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అధికారం, పదవులు శాశ్వతం కాదు. రేపు నువ్వు అటువైపు ఉంటావు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి. దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవడం మాని బాధితులను సస్పెండ్ చేయడం తగదు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఓ చీకటి రోజు’’ అని నారాయణ మండిపడ్డారు.

More Telugu News